కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ అభివృద్ధికి అధికారులందరూ సహకరించాలని రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం గోపాలపురంలోని ఆయన కార్యాలయంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా వివిధ ప్రభుత్వ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.