NDL: కోవెలకుంట్ల పరిధిలోని రేవనూరు నూతన ఎస్సైగా ధనుంజయ్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేస్తన్న భూపాలుడు నందివర్గానికి బదిలీ అయ్యారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.