SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాన్ ప్రభావంతో గాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని బారువ మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ అన్నారు. బారువ పోలీస్ సర్కిల్ కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు. మోటర్లు, బోట్లు, తెప్పలు, వలలు సురక్షిత ప్రాంతంలో భద్రపరుచుకోవాలని సూచించారు.