KRNL: ప్రస్తుత చలికాలంలో వ్యాధులు దరిచేరకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీపీవో భాస్కర్ సూచించారు. మంగళవారం సి.బెలగల్ మండలంలో ఐవీఆర్ఎస్ డోర్ టు డోర్ ద్వారా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే, తప్పనిసరిగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.