GNTR: మంగళగిరిలో కొలువైఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలోని రాజ్యలక్ష్మీ అమ్మవారికి, నీలి నాగమల్లేశ్వరరావు, రత్నకుమారి దంపతులు విలువైన కానుకను సమర్పించారు. అనంతరం వారు గురువారం అమ్మవారికి రూ.3.50 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు వేణు, తదితరులు పాల్గొన్నారు.