TPT: పుత్తూరు అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్సు పోలీసులు 19 ఎర్రచందనం దుంగలు, ఇద్దరు స్మగర్లను అరెస్టు చేశారు. SP ఆదేశాల మేరకు డీఎస్పీ ఎండీ షరీఫ్ ఆధ్వర్యంలో SI, ARSI ఎన్.ఈశ్వర్ రెడ్డి బృందం కైలాసకోన నుంచి కూంబింగ్ చేపట్టారు. ఈ మేరకు నారాయణవనం – సింగారకోన రోడ్డు కన్నికలమ్మ ఆలయం సమీపంలో ఇద్దరు దుంగలను తరలిస్తుండగా వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.