అనంతపురం: రాయదుర్గం పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా వాల్మీకి విగ్రహానికి, భక్తకన్నప్ప విగ్రహానికి పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి సంక్షేమ సేవా సమితి ఉపాధ్యక్షులు మలకన్న ఆధ్వర్యంలో పూజలు చేపట్టారు. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి సమాజంలో మానవుల మధ్య సంబంధాలు, విలువలు,బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు తెలియజేసిన మహా ఆదికవి వాల్మీకి మహర్షి అన్నారు.