ELR: ద్వారకా తిరుమల శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని ఈ నెల 27న పునః ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో NVSN మూర్తి తెలిపారు. కరోనా సమయంలో అధికారులు అంతరాలయ దర్శనాన్ని, అలాగే ముఖ మండపం లోంచి స్వామి, అమ్మవార్ల దర్శనాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి భక్తులు బయట నుంచే స్వామి, అమ్మవార్లను దర్శిస్తున్నారు. అయితే ఈ నెల 27 నుంచి పాత పద్ధతిలో దర్శనాలను పునరుద్ధరిస్తున్నారు.