కృష్ణా: నూజివీడు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి తెలిపారు. నూజివీడులో ఆయన ఆదివారం మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గా అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు. కౌన్సిల్ సభ్యులు అందరూ హాజరుకావాలని కోరారు.