కోనసీమ: మండపేట రావుల పేటలో ఉన్న రావుల చెరువు అభివృద్దికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. పటణంలోని 19వ వార్డులో గల చెరువును వేగుళ్ళ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రువర ప్రకాష్ , మున్సిపల్ కమీషనరు టి.వి. రంగారావులతో కలిసి సందర్శించారు. వెంటనే అభివృద్ధికి సంబంధిత అంచనాలు తయారు చేయాలని సూచించారు.