VZM: విజయనగరంలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్యహించటం జరుగుతుందని తెలియజేశారు. వీటిని పరిష్కరించేందుకు అంకితభావంతో పనిచేయాలని అధికారులకి సూచించారు.