KRNL: క్రిష్ణగిరి మండల కేంద్రంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దివ్యాంగులు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సభలో డోన్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి మాట్లాడారు. దివ్యాంగులను ఎవరైనా కించపరిస్తే 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు కారాగార శిక్ష, జరిమానా విధిస్తారన్నారు.