ప్రకాశం: కొనకనమిట్ల మండలం గాజులపల్లికి చెందిన సుమారు 50 వైసీపీ కుటుంబాలు నిన్న టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచ్ అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సాని కొమ్ము రవీంద్రారెడ్డి, వెంకటయ్య ఆధ్వర్యంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.