అన్నమయ్య: మదనపల్లెలోని వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థలో నేడు వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేను దివ్యాంగులు ఘనంగా జరుపుకున్నారు. వెలుగు కన్వీనర్ ఆర్.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. డౌన్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన రుగ్మత అని తెలిపారు. దీని లక్షణాలతో పుట్టిన వారు చిన్న తల, చిన్న మెడ, ఫ్లాట్ మొఖంతో కలిగి ఉంటారని చెప్పారు. దీనికంటూ ప్రత్యేక చికిత్స లేదని అన్నారు.