ప.గో: తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు నవ పుష్పాలతో అలంకరణ చేసి, స్వర్ణ ఆభరణాలతో పట్టు పీతాంబర వస్త్రాలతో అలంకరణ చేశారు. దేవాదాయ ధర్మాదయా శాఖ, జిల్లా కమిషనర్ దంపతులు పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేసి, అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలు చేశారు. ఈ క్రమంలో ఆయనను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించారు.