KRNL: సమయానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సచివాలయ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు తెలిపారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటల తర్వాత కూడా పెన్షన్లు ఇవ్వకపోవడం నిర్లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో 142 మంది, నంద్యాలలో 40 మంది సహా ఉమ్మడి జిల్లాలో 182 మందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.