ELR: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. సోమవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన వినతులను స్వీకరించి, సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించి, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అన్నారు.