కృష్ణా: అవనిగడ్డకు చెందిన మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కేంద్రం కీలక పదవి ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఇద్దరిని అదనపు సొలిసిటర్ జనరల్స్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారు.