W.G: నర్సాపురం రూరల్ పోలీసులు గురువారం డ్రోన్ కెమెరాల సహాయంతో నిర్మానుష్య ప్రదేశాలలో గస్తీ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపించిన కొందరు యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.