KDP: రాయచోటి నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు మహర్ధశ ప్రారంభమైంది. రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో రూ.416.96లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని రాచపల్లి, లక్కిరెడ్డిపల్లి,రాయచోటి, చిన్నమండెం, గాలివీడు, సంబేపల్లి తదితర వసతి గృహాలను చక్కదిద్దడం జరుగుతుందన్నారు.