NLR: పొదలకూరు మండలంలో శుక్రవారం 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురుస్తోంది. చలి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాలలోని రహదారులు బురదమయంగా మారడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.