కోనసీమ: రామచంద్రపురంకు చెందిన కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి కారుమూరి నిహారికకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ రూ. లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. నిహారిక ప్రస్తుతం 8 వ తరగతి చదువుతూ కిక్ బాక్సింగ్‌లో ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. బుధవారం ఆమెకు రాష్ట్ర మంత్రి సుభాష్ చేతుల మీదుగా చెక్ అందించారు.