KDP: దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అన్యాయం అని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కడపలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ను వైసీపీ నాయకులు కలిశారు.. ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా పొందుతున్న పింఛన్లను తొలగించడం తగదు అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పింఛన్లను పునరుద్దరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్యం వెంకట సుబ్బు పాల్గొన్నారు.