E.G: సీతానగరం గ్రామానికి చెందిన 4ఏళ్ల ఊర అభిజయ్ అసాధారణ జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు బుధవారం సాధించాడు. కేవలం 3 నిమిషాలు 10 సెకన్లలో 197 దేశాల జెండాలను గుర్తించి అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఈ విజయంతో సెప్టెంబర్ 27న చెన్నైలో కలామ్స్ వరల్డ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవర్ అవార్డును అందుకున్నాడు.