ATP: తాడిపత్రిలోని చేనేత కాలనీలో గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించే క్రమంలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఫైర్ అధికారి వెంకటరమణ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.