కృష్ణా: సర్ ఆర్ధర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం మోపిదేవి వార్పు వద్ధ కాటన్ దొర వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు. బ్రిటిష్ సైనికాధికారిగా వచ్చిన కాటన్ నీటి పారుదల ఇంజినీరుగా లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చే ప్రాజెక్టులు నిర్మించి రైతులకు మేలు చేశారన్నారు.