TPT: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.