BPT: పర్చూరులో ఇవాళ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కలెక్టర్ వినోద్ కుమార్, MLA సాంబశివరావు పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. బాధితుల సమస్యల పరిష్కారంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం వద్దన్నారు.