AKP: నేషనల్ పవర్ లిఫ్టర్స్ ఫెడరేషన్, కర్ణాటక స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈనెల 9,10,11,12 తేదీల్లో బెంగుళూరులో నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ జాతీయ స్థాయి పోటీలకు మ్యాచ్ రిఫరీగా రోలుగుంట ఆంగ్ల ఉపాధ్యాయురాలు పీవీఎం.నాగజ్యోతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నాగజ్యోతిని పలువురు అభినందించారు.