NDL: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భూసమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై శనివారం జేసీ కార్తీక్‌తో కలిసి రెవెన్యూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.