AP: విజయనగరంలోని భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ భోగాపురం వచ్చింది. విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులు వచ్చారు. జూన్లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది.