TG: కృష్ణా జలాల కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులపై నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహాలు చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్పై రేవంత్ విమర్శలకు KTR కౌంటర్ ఇచ్చారు. వినాశకాలే విపరీతబుద్ధి అని పెద్దలు చెప్తారని గుర్తు చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారని పేర్కొన్నారు.