మలయాళ హీరో నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన ‘సర్వం మాయ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డిసెంబర్ 25న రిలీజైన ఈ సినిమా 10 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ హర్రర్ కామెడీ సినిమా నివిన్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.