KMR: బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని సర్పంచ్ మానేవ్వ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏటిగడ్డ వద్ద రెండు కొత్త మోటార్లను ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.