HYD: ట్రాఫిక్ విధుల్లో ఉండగా ప్రమాదానికి గురైన మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ హోంగార్డ్ ఎండీ నయీముద్దీన్ను హైటెక్ సిటీలోని మెడికవర్ ఆసుపత్రిలో సీపీ డా.యం.రమేష్, ఐపీఎస్ పరామర్శించారు. గాయపడిన హోంగార్డ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పోలీస్ శాఖ ఆయనకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.