ELR: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.