SS: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పట్టణంలోని తన కార్యాలయంలో 27న బేగార్లపల్లి గ్రామంలో జరగనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ఘనంగా జరపాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, డా. శ్రీనివాస్ మూర్తి, మండల నాయకులు పాల్గొన్నారు.