నెల్లూరు: కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులు ప్రభుత్వం కల్పించిన 50% అపరాధ రుసుం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అనూష కోరారు. 31 తేదీలోగా పూర్తి మొత్తం చెల్లించిన వారికి మాత్రమే రాయితీ లభిస్తుందని అన్నారు. ఇందుకోసం సెలవు దినాలైనప్పటికీ ఆది, సోమవారాలలో సైతం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ తెరిచి ఉంటుందని తెలిపారు.