NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పెన్నా నది తీరాన వెలసియున్న శ్రీ కర్మఫలధాత శనీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆదివారం గోవర్ధన అమావాస్య సందర్భంగా పూజలు నిర్వహించారు. భక్తులు కూష్మాండ దీపారాధన, కుష్మాండ దిష్టి, కర్మ స్థానాలు, పితృదేవతల తర్పణాలు పూజా కార్యక్రమాలు భక్తులు భక్తితో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.