SKLM: స్వయం శక్తి సంఘంలో మహిళలు సంపూర్ణ ఆర్థిక అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యం అని మందస మండల ఐటీడీఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు అన్నారు. శనివారం మందస మండలం బైరి సారంగిపురం పంచాయతీలో వివిధ మహిళా సంఘాలలో సభ్యులు ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తున్న వివిధ వ్యాపారాలను పరిశీలించామని అన్నారు. పంచ సూత్రాలు పాటిస్తే అభివృద్ధి సాధ్యం అన్నారు.