తూ.గో: ప్రతి ఏడాది పాఠశాలలో బోధనా అంశాల తీరును పరిశీలించాల్సిన అధికారులు 14 ఏళ్ల తర్వాత వార్షిక తనిఖీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గండేపల్లి మండలం తాళ్లూరు జెడ్పీ స్కూల్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల నుంచి ఇప్పటి వరకూ సంబంధిత అధికారులు పాఠశాలలను తనిఖీ చేయకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.