KRNL: ఆదోనిలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు, కమిషనర్ కృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ రికార్డులు పరిశీలించి ఆహార నాణ్యతపై ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఆకుకూరలు, పెరుగు, రసంతో కూడిన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. సమయానికి ఆహారం సిద్ధం చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.