కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రావులపాలెం డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, ప్రస్తుతం ‘స్త్రీ శక్తి’ పథకం వర్తించే అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. అయితే, స్త్రీ శక్తి వర్తించని బస్సుల్లో 50 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.