బాపట్ల జిల్లాలో ఆదివారం నాన్ వెజ్ ధరలు వెల్లడయ్యాయి. చికెన్ కేజీ రూ. 270, స్కిన్ లెస్ రూ. 290గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 950 స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 450, రాగండి రూ. 200, బొచ్చెలు రూ. 230గా ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా చికెన్ ధరలు పెరిగినప్పటికీ, ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.