PLD: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జస్వంతరావును బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఏపీ కార్యాలయం ముందు రిపోర్ట్ చేయాలన్నారు. నరసరావుపేట మునిసిపాలిటీలో మున్సిపల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌కు కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.