SKLM: సముద్రపు అలల తాకిడికి మరో మత్స్యకారుడు బలిపోయాడు. వజ్రపుకొత్తూరు మండలం దేవునళ్తాడ గ్రామానికి చెందిన బీ. చినబాబు (42) గురువారం సముద్రంలో వేటకు వెళ్లాడు. అయితే అలల తాకిడికి తెప్ప నుంచి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోవడంతో మృతిచెందాడు. కాగా మృతునికి నాలుగు నెలల క్రితమే వివాహం అయ్యింది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.