ASR: యూరియా ఎరువు అధికంగా వాడడం వల్ల తెగుళ్లు సోకే అవకాశం ఉందని చింతపల్లి ఏవో మధుసూధనరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు బయ్యపురెడ్డి, హుస్సేన్ రెడ్డి, జోగారావు రైతులకు సూచించారు. శనివారం లంబసింగి పంచాయతీలో పర్యటించారు. రైతులతో కలిసి వరి పంట పొలాలను పరిశీలించారు. పొలాల్లో బాటలు ఏర్పాటు చేసి నీటిని కిందికి విడిచి పెట్టాలని సూచించారు.