VSP: ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సాగర్ తీరంలో 3 రోజులపాటు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆదివారం రాత్రితో ముగిసింది. 40 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా ఆదివారం రాత్రి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, టూరిజం జేడీ మాధవి, ఇతర ఉన్నత అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ 3 రోజులు లక్షల మంది ఫెస్టివల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.