CTR: పుట్టుకతోనే వైకల్యం.. ఎక్కడా తగ్గలేదు. ఆపై పేదరికం కుంగిపోలేదు. విధిని సవాలు చేస్తూ.. పట్టుదలతో ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తున్నాడు గణేష్. ఈ మేరకు SRపురానికి చెందిన ఈయనకు చిన్నప్పటి నుంచి ఒక కాలు లేకున్నా అధైర్యపడకుండా ఇష్టమైన క్రికెట్లో రాణిస్తూ దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా, బంగ్లా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు.