W.G: దైవ దర్శనాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.